: రేపు హైదరాబాద్ రోడ్లపై మిల్కాసింగ్ పరుగులు!
భారత విఖ్యాత ఆథ్లెట్ మిల్కాసింగ్ పరుగులతో ఆదివారం హైదరాబాద్ నగర రహదారులు మురిసిపోనున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో జరుగుతున్న 10కే రన్ లో మిల్కాసింగ్ పాల్గొంటున్నారు. ఇందుకోసం ఈరోజు సాయంత్రమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మిల్కాసింగ్, తన గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ లోనే తన క్రీడా జీవితం ప్రారంభమైందన్న మిల్కాసింగ్, ఈఎంఈ సెంటర్ లో తన పేరిట స్టేడియాన్ని నిర్మించడంపై హర్షం వ్యక్తం చేశారు.