: రైల్వే స్టేషన్లను ప్రైవేట్ పరం చేద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ


భారతీయ రైల్వేల ప్రైవేటీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వందేళ్ల క్రితం నాటి దుస్థితిలోనే రైల్వే స్టేషన్లు కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వాటిని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఆధునికీకరిద్దామని శనివారం పిలుపునిచ్చారు. మేఘాలయలో తొలి రైలును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘వందేళ్ల నాడు రైల్వే స్టేషన్లు ఎలా ఉన్నాయో, ఇప్పడూ అలానే ఉన్నాయి. వీటిని ప్రైవేట్ పరం చేద్దాం. ఆధునికీకరిద్దాం. తొలుత ఈ తరహా చర్యలను 10-12 స్టేషన్లలో అమలు చేద్దాం. విమానాశ్రయాల కంటే మెరుగైన వసతులు రైల్వే స్టేషన్లలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. కింద రైలు పోతుంటే, పైన వ్యాపార సముదాయాలుంటాయి’ అంటూ ఆయన చెప్పుకుపోయారు. భారతీయ రైల్వేలకు పెద్ద ఎత్తున స్థలాలు ఉన్న నేపథ్యంలో వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పజెప్పడం ద్వారా స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ప్రధాని చెప్పారు.

  • Loading...

More Telugu News