: గోదావరి పుష్కరాల్లో ‘ఎన్టీఆర్ సుజల’ తాగు నీరు!
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల దాహాన్ని 'ఎన్టీఆర్ సుజల' తీర్చనుంది. పుష్కరాలు జరిగే ప్రాంతంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం ప్రకటించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆయన శనివారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే మొత్తం 148 గ్రామాల పరిధిలో భక్తుల సౌకర్యార్థం 60 వేల మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.