: బీజేపీ, కాంగ్రెస్ సహా 20 పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా దేశంలోని 20 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో చేసిన ఖర్చులపై నిర్దేశించిన సమయం లోపల నివేదికలు సమర్పించకపోవడంపై పైవిధంగా ఈసీ చర్యలకు దిగింది. ఒకవేళ, వచ్చే వారం రోజుల్లోగా ఈ పార్టీలు అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల నివేదికలు ఇవ్వకపోతే వారి గుర్తింపు ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.