: తెలంగాణ సీఎంకు చైనా ఆహ్వానం
తెలంగాణ సీఎం కేసీఆర్ కు చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. విద్యుత్ ఉపకరణాల తయారీలో పేరొందిన తమ దేశ సంస్థ డాంగ్ పాంగ్ ను సందర్శించాలని ఆయనను కోరింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి శనివారం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలను సరఫరా చేసేందుకు డాంగ్ పాంగ్ సిద్ధంగా ఉందని ఆ ఆహ్వానంలో చైనా తెలిపింది. తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేసీఆర్ సర్కారు రానున్న కాలంలో పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో చైనా ఈ ఆహ్వానాన్ని పంపింది.