: పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి


పార్టీ కార్యకర్తల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తన సభ్యత్వాన్ని రెన్యూవల్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు కానున్న ప్రత్యేక సెల్, పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనుందని ప్రకటించారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి అవగాహన కల్పించేందుకు కేంద్ర మంత్రులను ఇక్కడికే పిలిపిస్తామన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలను కోరడం కొత్త విషయమేమీ కాదన్న ఆయన, రూ.1.07 లక్షల కోట్లు అవసరమవుతాయని శివరామకృష్ణన్ కమిటీయే చెప్పిందని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News