: సుష్మా స్వరాజ్ డమ్మీ కాదు: జవదేకర్


ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలతో సంబంధాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో, విదేశీ వ్యవహారాల మంత్రిగా సుష్మా స్వరాజ్ మరింత కీలకపాత్ర పోషించాల్సి ఉందంటూ వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సుష్మా ఉత్సవ విగ్రహం కాదని, కష్టించి పనిచేస్తున్నారని తెలిపారు. తమ క్యాబినెట్లో ప్రతి మంత్రి అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ గారి స్ఫూర్తిగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయిందాకా శ్రమిస్తున్నారని జవదేకర్ వివరించారు. అలా కష్టించిన కారణంగానే, గత యూపీఏ సర్కారు ఏళ్లుగా చేయలేనిది తాము ఆర్నెల్లలోనే సాధించామని చెప్పారు. వారిలో తాపత్రయం లోపించిందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News