: భారత మత్స్యకారులను కాపాడిన లంక నేవీ


భారత మత్స్యకారులు కనిపిస్తే అరెస్టు చేసే శ్రీలంక నావికాదళం, ఈసారి, తద్విరుద్ధంగా వ్యవహరించింది. శ్రీలంక ఉత్తర సముద్ర జలాల్లో చిక్కుకున్న ముగ్గురు భారత మత్స్యకారులను లంక నేవీ అధికారులు రక్షించారు. జాఫ్నా ద్వీపకల్పానికి సమీపంలోని మదగల్ వద్ద వీరి బోటు నిలిచిపోయి ఉండడాన్ని లంక బలగాలు గుర్తించాయి. ముగ్గురు మత్స్యకారులను వదుక్కోడై పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

  • Loading...

More Telugu News