: మకావు ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు


మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు చేరింది. సెమీఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన 23వ ర్యాంకు క్రీడాకారిణి బుసానన్ పై విజయం సాధించింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21-14, 21-15 తేడాతో సింధు అవలీలగా విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, బుసానన్ కూడా శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ సింధు దూకుడు ముందు నిలవలేకపోయింది.

  • Loading...

More Telugu News