: పంటకాలువలో మృతదేహాలు... ప.గో.జిల్లాలో కలకలం
పంటకాలువలో మూడు మృతదేహాలు లభ్యమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మొగల్తూరులోని ప్రధాన పంటకాలువ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా, మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను ఇద్దరు పురుషులు, ఓ స్త్రీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.