: మూడేళ్లలో పోలవరం నిర్మాణం పూర్తవుతుంది: కేఈ


టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. మూడేళ్లలో గోదావరిపై పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని... 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలిస్తామని చెప్పారు. వైకాపా అధినేత జగన్ అసత్య ఆరోపణలు మానుకోవాలని... రాష్ట్రాభివృద్ధి కోసం అధికారపక్షంతో కలసి పనిచేయాలని సూచించారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటన విజయవంతం అయిందని... విదేశీ నిధులతో చేపట్టే ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

  • Loading...

More Telugu News