: రజనీపై సెటైర్లు వేసిన ఖుష్బూ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎదురుగాలి వీస్తున్నట్టు కనిపిస్తోంది! రాజకీయ రంగప్రవేశంపై రజనీకి దర్శకనటుడు సీమాన్ సవాళ్లు విసరడం తెలిసిందే. తాజాగా, నటి ఖుష్బూ ఆయనపై సెటైర్లు విసిరారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పాలిటిక్స్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదని, ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలని అన్నారు. కాసేపు పాలిటిక్స్ లోకి వస్తానంటారని, మరికాసేపు రానంటారని ఎద్దేవా చేశారు. ఖుష్బూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. డీఎంకే పార్టీ నుంచి వైదొలగిన ఈ తార, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.