: ఢిల్లీలో దోపిడీ దొంగల దారుణం
దేశ రాజధానిలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా నేర సంఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలో దోపిడీ దొంగలు దారుణానికి పాల్పడ్డారు. స్థానిక కమలా నగర్ లో ప్రైవేటు బ్యాంకుకు చెందిన డబ్బును తరలిస్తున్న వ్యానును అడ్డుకుని రూ.1.5 కోట్లు ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును హత్య చేసి పారిపోయారు.