: హ్యూస్ గౌరవార్థం జెర్సీ నెంబర్ 64కి రిటైర్మెంట్


దేశవాళీ మ్యాచ్ లో మెడ భాగంలో బౌన్సర్ తగిలి, మృత్యువుతో పోరాడి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ కు ప్రపంచ వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. హ్యూస్ గౌరవార్థం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. వన్డే క్రికెట్లో హ్యూస్ ధరించిన జెర్సీ నెంబర్ 64కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇకపై ఈ నెంబర్ జెర్సీని మరెవరికీ కేటాయించరు. ఈ వివరాలను ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ ఇకపై మునుపటిలా ఉండదని... హ్యూస్ లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News