: బీజేపీ, శివసేన మధ్య నేడు రెండవ విడత చర్చలు
మహారాష్ట్రలో అధికారం పంచుకునే విషయమై బీజేపీ, శివసేన పార్టీల మధ్య రెండవ రోజయిన నేడూ చర్చలు జరగనున్నాయి. మహా ప్రభుత్వంలో సేన చేరుతుందా? లేదా? అనే అంశంపై ఈ రోజు ఎలాగైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ నేతలు ధర్మేంధ్ర ప్రధాన్, చంద్రకాంత్ పాటిల్ లు నిన్న (శుక్రవారం) శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే నివాసంలో చర్చలు జరిపారు. తమ ప్రభుత్వంలో ఐదు కేబినెట్ పదవులు సేనకు ఇచ్చేందుకు కమలదళం ప్రతిపాదించింది. మరి ఈ రోజయినా ఇరు పార్టీల చర్చలు సఫలమవుతాయా? అన్నది వేచి చూడాలి.