: గవర్నర్ నరసింహన్ కు ఢిల్లీ నుంచి పిలుపు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు వచ్చింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఢిల్లీలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో గవర్నర్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళుతున్నారు. శ్రీశైలం జలవిద్యుత్, ఇంటర్ పరీక్షలు, నిధుల బదలాయింపు, సివిల్ సర్వీసెస్ అధికారులు, ఉద్యోగుల బదిలీలు తదితర అంశాల్లో స్పష్టత ఇచ్చే అంశంలో భాగంగానే గవర్నర్ ను ఢిల్లీకి పిలిపించినట్టు తెలుస్తోంది.