: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గ్రౌండ్స్ మన్ కు క్రికెటర్ రాయుడు ఆసరా
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గ్రౌండ్స్ మన్ గా పనిచేస్తున్న షరీఫ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షరీఫ్ ను టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పరామర్శించాడు. షరీఫ్ కు అవసరమైన సాయం చేస్తానని, అతడి కుటుంబానికి అండగా నిలుస్తానని చెప్పాడు. కాగా, షరీఫ్ భార్య చెవిటి, మూగ. దీంతో, షరీఫ్ కుమారుడితో మాట్లాడిన రాయుడు, ఎలాంటి అవసరం వచ్చినా, తనను సంప్రదించమని సూచించాడు.