: ఇంజినీర్ ఇంట్లో రూ. 100 కోట్ల వజ్రాభరణాలు... షాక్ అయిన అధికారులు
యూపీలోని నోయిడా అథారిటీ ఇంజినీర్ యాదవ్ సింగ్ నివాసం, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు జరిపారు. ఈ సందర్భంగా, ఆయన నివాసంలో దాడులు జరిపిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. రూ. 100 కోట్ల వజ్రాభరణాలు, రూ. 10 కోట్ల నగదు, రూ. 90 లక్షల ఆడి కారును ఆయన నివాసంలో వారు గుర్తించారు. నివాసంలో పార్క్ చేసిన కారులో ఎనిమిది సంచుల్లో నగదును సర్ది ఉంచారు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిన ఇంజినీర్ యాదవ్ సింగ్ పై ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు.