: చంద్రబాబును సన్మానించనున్న జపాన్ తెలుగు సంఘం... రాత్రి హైదరాబాద్ చేరిక


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరు రోజుల జపాన్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆయన జపాన్ ప్రధానితో పాటు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీలో పెట్టుబడి అవకాశాలు, రాజధాని నిర్మాణం గురించి చర్చించారు. పలు సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించగలిగారు. ఈ రోజు ఉదయం చంద్రబాబును జపాన్ తెలుగు సంఘం సన్మానించనుంది. ఆ కార్యక్రమం పూర్తికాగానే అక్కడ నుంచి ఆయన అహ్మదాబాద్ చేరుకుంటారు. భారత వైద్య మండలి మాజీ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ కుటుంబంలో జరిగే వివాహానికి హాజరవుతారు. అనంతరం ఈ అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News