: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధునికీకరణకు నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆధునికీకరణకు నిధులు మంజూరైనట్టు అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ నిధులతో నక్సల్స్, ఎర్రచందనం, స్మగ్లింగ్ నేరాల నియంత్రణ కోసం వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, అక్షయగోల్డ్ బాధితుల సమాచారాన్ని సీఐడీకి ఇవ్వాలని ఆయన సూచించారు.