: 5,000 మంది సుశిక్షితులైన సైనికుల్ని తయారు చేస్తున్నాం: పొన్నాల
కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే 5000 మంది దళిత సైనికుల్ని తయారు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా తరగతుల ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు. అందుకే ప్రతి మండలం నుంచి పది మంది దళితులను ఎంపిక చేసి, వారిని విశాలభావాలు కలిగిన వారిగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. ఈ సదస్సుకి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని ఆయన వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు. కేవలం సభను పక్కదారి పట్టించేందుకు ఎంచుకున్న అస్త్రమని ఆయన స్పష్టం చేశారు.