: జవాన్లు ఆ ఉగ్రవాదులను ఏరిపారేశారు!


నిన్నట్నుంచి కలుగులో దాక్కున్న ఎలుకల్లా బంకర్ లో దాక్కుని భారత జవాన్లు, పౌరులపై కాల్పులు జరుపుతున్న నలుగురు ఉగ్రవాదుల కథ కంచికి చేరింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్నియా సెక్టార్లో నిరుపయోగంగా ఉన్న ఆర్మీ బంకర్ లోకి జవాన్ల వేషధారణలో ఉన్న ఉగ్రవాదులు చొరబడ్డారు. దీనిని పసిగట్టిన జవాన్లు వారిని లొంగిపొమ్మని హెచ్చరించారు. వారు కాల్పులకు దిగడంతో భారత జవాన్లు వారిని మట్టుబెట్టారు. ఈ పోరాటంలో ఐదుగురు పౌరులు, ముగ్గురు జవాన్లను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. నలుగురు ఉగ్రవాదులను అంతం చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రధాని మోదీ కాశ్మీర్ లో రెండో దఫా ఎన్నికల ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు.

  • Loading...

More Telugu News