: అమిత్ షా ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోల్ కతాలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి కలకత్తా హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కోల్ కతా కార్పొరేషన్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, బీజేపీ ఈ రోజు కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం... ర్యాలీ విధివిధానాలు నిర్ణయించేందుకు కోల్ కతా మున్పిపల్ కార్పొరేషన్ నుంచి ఒకరిని, పశ్చిమబెంగాల్ పైర్ విభాగం నుంచి ఒకరిని ప్రత్యేక అధికారులుగా నియమించింది. వీరికి ఓ సీనియర్ పోలీసు అధికారి సహకరిస్తాడని పేర్కొంది. ఆదివారం జరిగే బీజేపీ ర్యాలీ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను వారు శనివారం సమావేశమై ఖరారు చేస్తారని తెలిపింది. అటు వారు చెప్పే ఆదేశాలను పాటించేందుకు బీజేపీ కూడా ఇద్దరు సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని న్యాయస్థానం సూచించింది.

  • Loading...

More Telugu News