: నకిలీ కుక్కర్లు, మిక్సీలు, ఫ్యాన్లు తయారుచేస్తున్న కంపెనీలు సీజ్


బ్రాండెడ్ గృహోపకరణాల కంపెనీల ప్రతినిధులు హైదరాబాదు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిశారు. తమ కంపెనీలకు చెందిన వస్తువుల విక్రయాలు తగ్గిపోయాయని వాపోయారు. హైదరాబాదులోని పారిశ్రామిక వాడల్లో నకిలీ ఉత్పత్తుల కేంద్రాలు పెరిగిపోయాయని, అచ్చం అసలైన వాటిలా నకిలీ ఉత్పత్తులు తయారుచేసి, మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారని, దాని కారణంగా తమ ఉత్పత్తుల విక్రయాలు పడిపోయాయని సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోందని వారు సీపీకి వివరించారు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించిన సీపీ నకిలీ ఉత్పత్తుల తయారీ కంపెనీలను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News