: 'అనంత'లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి... జపాన్ లో చంద్రబాబు దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లా విడపనకల్ మండలం చీగలగుర్కిలో పొలంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఐదుగురు మరణించారు. మృత్యువాతపడ్డ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం విచారణకు ఆదేశించారు.