: ఉగ్రవాదుల్లో చేరి... మనసు మారి ఇంటికొచ్చేశాడు
తుపాకి పట్టాలన్న కోరికో, లేదా, తప్పుడు బోధనల ప్రభావమో... ఆ యువకుడు ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థతో కలవాలని మరో ముగ్గురితో కలసి ఇరాక్ వెళ్లిన ముంబై యువకుడు ఆరిఫ్ మజీద్ కు అక్కడికి వెళ్ళిన తరువాతే అసలు విషయం తెలిసొచ్చింది. తాను అక్కడ ఇమడలేనని తెలుసుకొని తిరిగి ఇల్లు చేరాడు. ప్రస్తుతం అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నెల మొదట్లోనే మజీద్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఇంటికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తనతో పాటు ఇరాక్ వచ్చిన వారు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని మజీద్ తెలిపాడు.