: ఆయుధపూజలో రివాల్వర్ మిస్... ఎస్సైపై సస్పెన్షన్ వేటు!


ఖమ్మం జిల్లాలో ఓ ఎస్సై సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకుని, సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. ఆళ్లపల్లి ఎస్సై పృథ్వీరాజ్ దసరా సందర్భంగా నిర్వహించే ఆయుధపూజలో తన రివాల్వర్ పోగొట్టుకున్నాడు. అయితే, విషయం ఉన్నతాధికారులకు తెలియజేయకుండా దాచారు. ఎలాగో ఈ సంగతి ఉన్నతాధికారులకు తెలియడంతో వారు అంతర్గత విచారణ జరిపి, పృథ్వీరాజ్ ను సస్పెండ్ చేశారు. కాగా, మిస్సైన పది రోజుల అనంతరం ఆ రివాల్వర్ స్టేషన్లో కనిపించిందంటున్నారు. అయితే, దీనిపై స్పష్టత లేదు.

  • Loading...

More Telugu News