: ప్రవర్తన నచ్చడం లేదంటూ అక్కనే నరికేశాడు
ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అక్రమ సంబంధాలు నడుపుతోందని ఆరోపిస్తూ, తోడబుట్టిన అక్కనే చంపేసిన ఘటన కరీంనగర్ జిల్లా మహాముత్తారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాడి మల్లమ్మకు కూతురు లక్ష్మి, కొడుకు రాజబాపు ఉన్నారు. కొన్నాళ్ళ కిందట లక్ష్మి భర్త మృతి చెందాడు. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో వంటమనిషిగా పనిచేసిన లక్ష్మి, వరంగల్ కు చెందిన శివకుమార్ తో పరిచయం పెంచుకొని ఇంటికి తీసుకువచ్చి సహజీవనం చేస్తోంది. ఆమె గతంలోనూ ఇలాగే ఓ వ్యక్తిని తీసుకొచ్చి, కొంతకాలం తరువాత విడిపోయిందని, ప్రవర్తన మార్చుకోవాలని చాలా సార్లు హెచ్చరించినా మారలేదని, అందువల్లే ఆమెను హతమార్చానని నిందితుడు రాజబాపు అంగీకరించాడు. గొడ్డలితో లక్ష్మి మెడపై నాలుగుసార్లు నరకడంతో ఆమె మరణించిందని కాటారం సీఐ తెలిపారు.