: కేజ్రీవాల్ భోజనం 'కాస్ట్లీ' గురూ!


ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న మధ్యంతర ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికల్లో బీజేపీతో అమీతుమీకి నిధుల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఇందు నిమిత్తం కేజ్రీవాల్ 'విందు' బాటపట్టారు. ఈ మేరకు ముంబైలో వజ్రాల వ్యాపారులు, బ్యాంకర్లు ఇతర ప్రముఖులకు విందు భోజనం పెట్టారు. విందులో పాల్గొన్నవారు ప్లేటు భోజనానికి 20 వేల రూపాయల చొప్పున చెల్లించారు. ఇలా విందు రూపేణ ఆమ్ ఆద్మీ పార్టీ 91 లక్షల రూపాయల మొత్తాన్ని సేకరించింది. ఇందులో 36 లక్షల రూపాయలు నగదు కాగా, మరో 36 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులున్నాయి, మిగిలిన నగదు వలంటీర్ల ద్వారా వసూలైంది. దీని స్ఫూర్తిగా కేజ్రీవాల్ త్వరలో బెంగళూరులోనూ విందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కూడా కేజ్రీవాల్ ఇదే విధానం ద్వారా నిధులు సేకరించిన సంగతి తెలిసిందే. కాగా, కేజ్రీవాల్ నిధుల సేకరణకు విందు పద్ధతి ఎంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పార్టీగా చెప్పుకునే ఆప్ ప్లేటు భోజనానికి 20 వేల రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రత్యర్థులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News