: యాదగిరిగుట్ట లాడ్జీలపై పోలీసుల దాడులు... అదుపులో 15 ప్రేమ జంటలు
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని లాడ్జీలు, గెస్ట్ హౌస్ లపై పోలీసులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో 15 ప్రేమ జంటలు పట్టుబడ్డట్టు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించే ఏర్పాట్లు చేశారు. వీరికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇటీవలి కాలంలో గుట్టపై ప్రేమజంటలు పెరిగిపోయాయని, వ్యభిచారం కూడా జరుగుతోందని పలు ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు జరిపినట్టు తెలుస్తోంది.