: ఆరునెలల్లో తెలంగాణకు వచ్చిన ఆదాయం రూ. 25,947 కోట్లు: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ఆదాయ వివరాలను ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గత 6 నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ. 25,947 కోట్లు అని తెలిపారు. ఇందులో... ట్యాక్స్ ఆదాయం రూ. 15,101 కోట్లు, పన్నేతర రెవెన్యూ ఆదాయం రూ. 1,273 కోట్లు, సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ రూ. 3,969 కోట్లు, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ. 2,514 కోట్లు, ఇతరములు రూ. 288 కోట్లు అని వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న మొత్తం రూ. 5 వేల కోట్లని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ. 2,800 కోట్లు అని తెలిపారు. పంపకాల్లో భాగంగా జూన్2, 2014న మిగులు నిల్వ కింద తెలంగాణకు రూ. 2,544 కోట్లు వచ్చిందని కేసీఆర్ చెప్పారు. వచ్చే బడ్జెట్లో లెక్కలపై మరింత క్లారిటీ ఇస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News