: ర్యాలీకి అనుమతించలేదని కోల్ కతా హైకోర్టులో బీజేపీ పిటిషన్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి కోల్ కతా కార్పోరేషన్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి, పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఈ మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టనుంది. స్థానిక విక్టోరియా హౌస్ వద్ద ఈ ఆదివారం ర్యాలీ నిర్వహించుకునేందుకు చేసిన దరఖాస్తులో తెలిపిన ప్రణాళికలో సాంకేతిక లోపాలున్నాయంటూ కార్పొరేషన్ తిరస్కరించింది. అంతేగాక ర్యాలీ వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని కోల్ కతా పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News