: 'మేము సైతం' టాలీవుడ్ క్రికెట్ జట్లు ఇవే


తెలుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. తాజాగా, హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు మరోసారి టాలీవుడ్ మొత్తం కదిలింది. మేము సైతం పేరుతో ఈ నెల 30న టాలీవుడ్ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా సినీతారల క్రికెట్ కూడా ఉంది. మొత్తం నాలుగు టీంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో క్రికెట్ ఆడబోతున్నాయి. ఈ నాలుగు జట్లకు వెంకటేష్, రామ్ చరణ్, నాగార్జున, ఎన్టీఆర్ లు నాయకత్వం వహిస్తున్నారు. టీమ్ ల వివరాలు ఇవే. వెంకటేష్ జట్టు... వెంకటేష్, విష్ణు, రాజశేఖర్, మనోజ్, నితిన్, నారా రోహిత్, సుశాంత్, నవీన్ చంద్ర, దాసరి అరుణ్ కుమార్, మాదాల రవి, ఆదర్శ్, సమంత, మంచు లక్ష్మి, సంజన, ప్రియా బెనర్జీ, తేజస్వి. రామ్ చరణ్ జట్టు... రామ్ చరణ్, తరుణ్, గోపీచంద్, సుమంత్, సుధీర్ బాబు, ఆది, తారకరత్న, వరుణ్ సందేశ్, వడ్డే నవీన్, ఖయ్యూమ్, అజయ్, కాజల్, ఛార్మి, అర్చన, పూనమ్ కౌర్, రీతూ వర్మ. నాగార్జున... నాగార్జున, అఖిల్, కల్యాణ్ రామ్, అల్లరి నరేష్, నిఖిల్, నాగశౌర్య, సచిన్ జోషి, సాయికుమార్, శర్వానంద్, శివాజీరాజా, రాజీవ్ కనకాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, మధుశాలిని, సోనియా, దిశా పాండే. ఎన్టీఆర్ టీమ్... ఎన్టీఆర్, శ్రీకాంత్, రవితేజ, నాని, సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, ప్రిన్స్, తనీష్, తమన్, సమీర్, రఘు, అనుష్క, దీక్షాసేథ్, నిఖిల్, శుభ్రా అయ్యప్ప, అస్మితా సూద్.

  • Loading...

More Telugu News