: త్వరితగతిన పోలవరం పూర్తి: దేవినేని ఉమ


పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఇందుకోసం ప్రాజెక్టు పనులపై నెలవారీ సమీక్షలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. పోలవరం ముంపు మండలాల ప్రజలు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన శుక్రవారం చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుండగానే గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు డిసెంబర్ మాసంలో పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News