: సోనమ్ కపూరే బాలీవుడ్ 'మోస్ట్ స్టయిలిష్ సెలబ్రిటీ'


అందాల భామ సోనమ్ కపూరే బాలీవుడ్ లో 'మోస్ట్ స్టయిలిష్ సెలబ్రిటీ' అని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెండెల్ రోడ్రిక్స్ అంటున్నాడు. నటి రేఖ, బిపాసాబసు, అనుష్క శర్మ వంటి పలువురు ముద్దుగుమ్మలతో పనిచేసిన ఈ డిజైనర్, ప్రయోగాలు చేసేందుకు సోనమ్ ఎప్పుడూ ముందుంటుందని అభిప్రాయపడ్డాడు. "ఫ్యాషన్ ను బాగా అర్థం చేసుకోగల నటి తనొక్కతే. అందుకే బాలీవుడ్ లో అత్యంత స్టయిలిష్ సెలబ్రిటీ, స్టయిల్ ఐకాన్ సోనమే. ప్రయోగాలకు తనెప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మిగతా కథానాయికల్లా కాకుండా, అవసరమైతే ఓ కార్యక్రమానికి తను మంచి ధోతీ చీరను కూడా కట్టుకోగలదు" అని వెండెల్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News