: ఇరాక్ లో కిడ్నాప్ కు గురైన భారతీయులు చనిపోయారనడానికి ఆధారాల్లేవు: సుష్మా
ఇరాక్ లో ఐఎస్ఐఎస్ తాను అపహరించిన 40 మంది భారతీయులను హతమార్చిందంటూ ఓ విదేశీ చానల్ పేర్కొనడంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వారు సురక్షితంగానే ఉన్నారంటూ నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని తెలిపారు. కిడ్నాప్ కు గురైన భారతీయుల విషయంలో కేంద్రం అవాస్తవాలు చెబుతోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించడంపై సుష్మా పైవిధంగా బదులిచ్చారు. ఐఎస్ఐఎస్ చెర నుంచి తప్పించుకున్న హర్జీత్ మస్సీ చెప్పిన విషయాల ఆధారంగానే ఈ కథనాలు పుట్టుకొస్తున్నాయని సుష్మా పేర్కొన్నారు.