: కారు దిగి నేరుగా ప్రజలకు వద్దకు వెళ్లి 'థాంక్స్' చెప్పిన మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ తన గొప్పదనాన్ని మరోమారు చాటుకున్నారు. ఎనిమిది మంది సార్క్ దేశాధినేతలకు నేపాల్ పర్వత ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందుకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంగా, మోదీ ఖాట్మండూ వీధుల్లో ఉన్నట్టుండి కారాపమన్నారు. కారు దిగి నడుచుకుంటూ వెళ్లి, అప్పటికే అక్కడకు భారీగా చేరిన నేపాలీయులకు వ్యక్తిగతంగా 'థాంక్స్' చెప్పారు. వారి ఆతిథ్యానికి సంతోషిస్తున్నానని తెలిపారు. కరచాలనం చేసి వారిని ఆనందంలో ముంచెత్తారు. అటు, సార్క్ సదస్సు సందర్భంగా నేపాల్ ప్రభుత్వ ఆతిథ్యం పట్ల ప్రధాని సుశీల్ కోయిరాలాకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం 'థాంక్యూ నేపాల్' అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News