: ప్రధాని పర్యటనకు ముందు కాశ్మీర్ లో ఉగ్రవాది కాల్పులు
ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా అక్కడ ఆయన తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఈరోజు ఆ రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి తరహాలోనే ఓ ఉగ్రవాది భారత్ బలగాలపైకి కాల్పులకు దిగాడు. దీంతో భారత సైన్యం సదరు ఉగ్రవాదికి దీటుగానే బదులిచ్చింది. నిన్న కూడా నలుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా భారత సైన్యం, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, నేటి ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. మోదీ పర్యటన నేపథ్యంలో అటు రాష్ట్ర పోలీసులతో పాటు, ఇటు భారత సైన్యం కూడా కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది.