: రేడియోలో ఇప్పుడు కేజ్రీవాల్ 'మన్ కీ బాత్'


తొలిసారి ప్రధానమంత్రి అయ్యాక రెండుసార్లు రేడీయోలో 'మన్ కీ బాత్' పేరుతో నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సందేశాన్నిచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేడియోలో ప్రసంగం చేయబోతున్నారు. అయితే, మోదీ ప్రభుత్వ అధీనంలోని ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగిస్తే, కేజ్రీవాల్ ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో చానెల్స్ ద్వారా ప్రసంగిస్తారు. కేవలం ఆయన మాట్లాడటమే కాకుండా, ప్రజలతోనూ లైవ్ ద్వారా మాట్లాడతారట. డిసెంబర్ 3 నుంచి ఆయన రేడియో ప్రసంగాలు ప్రసారమవుతాయి. గతంలో ఢిల్లీలో తొలిసారి ఎన్నికల్లో పాల్గొన్న ఆమ్ ఆద్మీ, తన ప్రచారంలో భాగంగా అప్పుడే రేడియోను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. తరువాత బీజేపీ కూడా అదే బాటలో నడిచింది. త్వరలో దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఆప్ ప్రచారం మొదలుపెట్టింది.

  • Loading...

More Telugu News