: అమ్మాయిలపై అత్యాచారాలు చేసేది బాయ్ ఫ్రెండ్స్ లేదా బంధువులే!
అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచార ఘటనలలో అత్యధిక భాగం నిందితులు బాయ్ ఫ్రెండ్స్ లేదా బాగా తెలిసిన వారేనట. ముంబై నగరంలో బాయ్ ఫ్రెండ్స్ చేతిలో అత్యాచారానికి గురవుతున్నవారి సంఖ్య పెరుగుతోందని నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియా వివరించారు. ఈ సంవత్సరంలో 542 అత్యాచార ఘటనలు చోటు చేసుకోగా, 389 కేసుల్లో నిందితులు స్నేహితులేనని ఆయన చెప్పారు. మరో 100 కేసులలో బంధువులు లేదా తెలిసినవారే నిందితులని పేర్కొన్నారు. కేవలం ఆరు శాతం మంది మాత్రమే ఆగంతుకుల చేతిలో అత్యాచారానికి గురయ్యారని తెలిపారు. స్నేహితులు చెప్పే మాయ మాటలను యువతులు వెంటనే నమ్మడం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.