: అలా చేస్తే మత ఘర్షణలే... ముస్లిం యూనివర్సిటీలో బీజేపీ వేడుకలపై కేంద్రానికి లేఖ
అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో బీజేపీ తలపెట్టిన రాజా మహేంద్ర ప్రతాప్ జయంతి ఉత్సవాలకు అనుమతి ఇస్తే, మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముందని వర్సిటీ వైస్ ఛాన్సలర్ జమీర్ ఉద్దీన్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాసారు. డిసెంబర్ 1న జాట్ వర్గ నేత రాజా మహేంద్ర ప్రతాప్ జయంతిని జరపాలని బీజేపీ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్ణయించింది. దీన్ని ఎలాగైనా ఆపి విద్యార్థుల మధ్య ఘర్షణలు నివారించాలని జమీర్ ఆ లేఖలో కోరారు. ఈ వేడుకలను ఎలాగైనా యూనివర్సిటీ ప్రాంగణంలోనే జరపాలని అలీఘడ్ ఎంపీ సతీష్ గౌతమ్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. నిఘా వర్గాలు సైతం సోమవారం నాడు విద్యార్థుల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి.