: వంద రోజుల్లో నల్లధనం తెస్తామని మేమెన్నడూ హామీ ఇవ్వలేదు: వెంకయ్య
నల్లధనం అంశం పార్లమెంటు ఉభయసభలనూ అట్టుడుకిస్తున్న సంగతి తెలిసిందే. విపక్షాలు ఈ అంశంపై పూర్థి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తెస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదని చెప్పారు. 2009 బడ్జెట్ సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ ఈ మాట అన్నారని గుర్తుచేశారు. ఇంత తక్కువ సమయంలో నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని చెప్పేంత అపరిపక్వత కలిగిన వ్యక్తులం కాదని అన్నారు. అవినీతిని కనిష్ట స్థాయికి తీసుకు వస్తామని, నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపడతామని మాత్రమే తాము చెప్పామని అన్నారు.