: నితిన్ ను డైరెక్టర్లంతా పాలిష్ చేశారు: అలీ
హీరో నితిన్ ను తేజ, వీవీ వినాయక్ దగ్గర్నుంచి కరుణాకరన్ వరకు అందరూ సానబట్టారని నటుడు అలీ తెలిపారు. 'చిన్నదాన నీ కోసం' సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకుంటున్నానని అలీ అన్నారు. నితిన్ కు మంచి విలువలు ఉన్నాయని, నటులను, వ్యక్తులను ఎలా ఆదరించాలో నితిన్ కు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. సినిమా హీరోయిన్ మిష్టీ బాగా నటించిందని పేర్కొన్నారు. పాటలు బాగా వచ్చాయని తెలిపిన అలీ, సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలిపారు.