: 43 దేశాలకు భారత్ ఈ-వీసాలు


43 దేశాల నుంచి వచ్చే పర్యాటకులు, ఇతరత్రా కార్యక్రమాల కోసం బారత్ కు వచ్చే వారి కోసం ఈ-వీసాలు జారీ చేసే కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయిల్‌, జర్మనీ వంటి 43 దేశాల పర్యాటకులకు ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం తదితర అంతర్జాతీయ విమానాశ్రయ కేంద్రాల్లో ఈ-వీసాను జారీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్‌ వీసాలిచ్చే విధానాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ-వీసా కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. మూడు నుంచి ఐదు రోజుల్లోనే ఈ-వీసాలు జారీ చేసే ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News