: 'హుదూద్' తుపాను శ్రీకాకుళానికి చేసిన నష్టం 1500 కోట్లు
'హుదూద్' తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన బృందం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించింది. జిల్లాలోని 'హుదూద్' ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టం వివరాలు సేకరించింది. తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాకు 1500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. అనంతరం కేంద్ర బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి నష్టం వివరాలు చూపించిన కలెక్టర్ నీతూ ప్రసాద్, బృందానికి నష్టంపై వివరించారు.