: హైకోర్టు తీర్పును జూడాలు గౌరవించాలి: పుట్టా శ్రీనివాస్


తెలంగాణ వైద్య విద్య సంచాలకులు పుట్టా శ్రీనివాస్ తో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. జాడాలతో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు తీర్పును జూనియర్ డాక్టర్లు గౌరవించాలని అన్నారు. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని ఆయన సూచించారు. కాగా, జూడాలు మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అన్నారు. తాము నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News