: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధాన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే, చర్చల సందర్భంగా పార్టీల నేతలు కొన్ని సూచనలు, సలహాలు తెలిపి, అనంతరం, వారి అంగీకారం వెల్లడించారు. పారిశ్రామిక విధానానికి ఆమోదించిన అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మధ్యాహ్నమే ప్రభుత్వం పారిశ్రామిక విధానానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.