: నల్లధనం వేరు... విదేశీ ఖాతాలు వేరు: వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి
నల్లధనం, విదేశీ ఖాతాలు వేరన్న విషయం గుర్తించాలని తెలంగాణ వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. లోక్ సభలో నల్లధనంపై జరుగుతున్న రెండో రోజు చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1998-2008 మధ్య పదేళ్ల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయల ధనం దేశం దాటిపోయిందని అన్నారు. ఈ ధనం మొత్తం పన్నుల వ్యవస్థ సరళంగా ఉన్న సైప్రస్, స్విట్జర్లాండ్ దేశాలకు తరలిపోయిందని ఆయన వివరించారు. మన ఆర్థిక విధానాలను సరళీకృతం చేసుకుంటే నల్లధనం దేశాలు దాటకుండా చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు విదేశాలతో చర్చలు, సంప్రదింపులు జరపాలని ఆయన సూచించారు. నల్లధనం దేశ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.