: వరుణ్ ఆరోన్ పేస్ పై ఆస్ట్రేలియన్లలో ఆందోళన


టీమిండియా స్పీడ్ స్టర్ వరుణ్ ఆరోన్ పేస్ పై ఆస్ట్రేలియన్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసీస్ పర్యటనలో భాగంగా తొలి ప్రాక్టీసు మ్యాచ్ లో ఆరోన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. అలవాటైన పిచ్ లపై కూడా ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ ఆరోన్ బౌలింగ్ ను ఎదుర్కొనలేకపోయారు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆరోన్ కంగారూలను ఇబ్బందులకు గురిచేశాడు. ఆ మ్యాచ్ లో సీఏ జట్టు తరపున ఆడిన ర్యాన్ కార్టర్స్ మాట్లాడుతూ, ఆరోన్ తో ఆస్ట్రేలియన్లకు కష్టాలు తప్పవన్నాడు. ఇంతకుముందు ఆసీస్ పర్యటనకు వచ్చిన భారత బ్యాట్స్ మెన్ పేస్, బౌన్స్ తో ఇబ్బందులు పడేవారని, ఇప్పుడా పేస్, బౌన్స్ ఆరోన్ కు ప్రధానాయుధాలు అని కార్టర్స్ పేర్కొన్నాడు. టీమిండియాతో ప్రాక్టీసు మ్యాచ్ లో కార్టర్స్ 58 పరుగులు సాధించడం విశేషం.

  • Loading...

More Telugu News