: బాబు వంశంలోనే పిచ్చి ఉంది... జగన్ కు ఉందని నిరూపించగలరా?: అంబటి సవాల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వంశంలోనే పిచ్చి ఉందని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. జగన్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు బావమరిది బాలకృష్ణకు మతిస్థిమితం లేదని వైద్యులు ధ్రువీకరించిన సంగతి వాస్తవం కాదా? అని అన్నారు. అలాగే బాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు మతిస్థిమితం లేక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. "అంతెందుకు, చంద్రబాబుకు... జగన్ కు వైద్యపరీక్షలు చేద్దాం, చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడన్నా, జగన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని నివేదిక ఇచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను" అని అంబటి సవాలు విసిరారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి, దూషించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.